calender_icon.png 1 May, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

01-05-2025 04:55:37 PM

ఎమ్మెల్యే మురళి నాయక్...

మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే దేహదారుఢ్యం పెంపొందించడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Bhukya Murali Naik) అన్నారు. కేసముద్రం మండలం కల్వల జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం నెట్ బాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఘనంగా నిర్వహించడం జరిగింది.

పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన కల్వల టాపర్స్ కే. తేజస్విని, వై. వెన్నెల, గూబ శివాని లకు మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి ప్రోత్సాహక బహుమతిగా ప్రకటించిన 3వేల రూపాయలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి ఓ.జ్యోతి, పిఎసిఎస్ వైస్ చైర్మన్లు అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు, నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వేం వాసుదేవ రెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, హెడ్మాస్టర్ బండారు నరేందర్, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్, తుమ్మ సురేష్, ఉపాధ్యాయులు మహంకాళి ఏకాంబరం, కే.రాములు, మార్గం శ్రీనివాస్, జి. నాగరాజు, ఏ.లింగయ్య పాల్గొన్నారు.