14-04-2025 12:00:00 AM
నారాయణఖేడ్, ఏప్రిల్ 13: నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మనూరు మండలం దుదగొండ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఆదివారం పరిశీలించారు. ప్రతి లబ్ధిదారులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. గ్రామంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. తుమ్నూరు గ్రామంలో గొల్ల కురుమ సంఘం కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో నాయకులు దిగంబర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, న్యాయవాది సంగన్న, రాజు, వినోద్ పాటిల్, ఆకాశరావు పాటిల్, గంపల సిద్ధారెడ్డి, విష్ణు రెడ్డి, భూషణం తదితరులు పాల్గొన్నారు.