01-05-2025 04:25:02 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన మానుకోట జిల్లా విద్యాశాఖ అధికారులకు అభినందనలు వెలువెత్తుతున్నాయి. జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ వీ.రాజేశ్వర్, ఏసిజి ఈ మందుల శ్రీరాములును మహబూబాబాద్ జిల్లా టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా ఖ్యాతిని రాష్ట్రంలో అగ్ర భాగాన నిలిపేందుకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గణేష్, జనరల్ సెక్రెటరీ ముజాహిద్ అలీ, ఆఫీస్ సూపర్డెంట్ ఉమామహేశ్వర్, సిహెచ్ శ్రీనివాస్, జ్యోతి, ఎస్.బి శ్రీనివాస్, ఎండి సమద్ అహ్మద్, శ్రీకాంత్, రమేష్ పాల్గొన్నారు.