calender_icon.png 1 May, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడే స్ఫూర్తితో ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుదాం

01-05-2025 04:40:30 PM

ఘనంగా మేడే వేడుకలు..

తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్..

కరీంనగర్: మే డే స్ఫూర్తితో ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుదాం అని తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ అన్నారు. మే డే ను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో గురువారం తపాలా కార్యాలయం, ఎల్ఐసి కార్యాలయం, హమాలీ సంఘం, తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం నిర్వహించుకొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. ఎంతోమంది పోరాటాల త్యాగ ఫలితమే ఈ మేడేను నిర్వహించుకుంటున్నామన్నారు. శ్రామిక వర్గం జీవించడానికై సరిపడే వేత నాల కొరకై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేసిందన్నారు.

మిగతా 29 చట్టాలను నాలుగు లేబర్ కోర్సుగా ఆమోదించి అమలు చేయడం వల్ల ప్రభుత్వ ప్రైవేటు రంగా సంస్థలో పనిచేసే కార్మికులు ఉద్యోగులు కట్టు బానిసలుగా మారబోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యోగ కార్మిక చర్యలను ప్రశ్నించి నిరసన తెలిపే ఉద్యోగ సంఘాలను ప్రభుత్వంఅణచివేసే ధోరణిని అనుసరిస్తుందన్నారు. కేంద్ర ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన ఎనిమిదవ వేతన కమిటీ జాప్యం చేయకుండా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, సమ్మయ్య, హరీష్, వేణు, ఎర్ర రాజు, సందీప్, అనిల్, కుమారస్వామితో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.