01-05-2025 04:32:04 PM
పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్...
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని కేసముద్రం(వి) లో విశ్వబ్రాహ్మణ సంఘం నూతనంగా నిర్మించబోతున్న శ్రీ శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయము, శ్రీ సరస్వతి దేవి అమ్మవార్ల నూతన దేవాలయముల నిర్మాణానికి గురువారం భూమి పూజ, శిలా న్యాస శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ బండారి వెంకన్న, పిసిసి సభ్యుడు గుగులోత్ దస్రు నాయక్ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మురళి నాయక్ ను శాలువాతో సత్కరించారు. సమిష్టి కృషితో ఆలయాల నిర్మాణానికి ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ సంకేపల్లి నారాయణరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలేపల్లి వెంకట్ రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, లక్కాకుల నరసయ్య, బుర్ర నాగిరెడ్డి, కమటం సురయ్య, కనుకుల రాంబాబు, విశ్వబ్రాహ్మణ సంఘం, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.