calender_icon.png 1 May, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల హక్కుల పరిరక్షణే మా లక్ష్యం

01-05-2025 04:28:41 PM

సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ...

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే కార్యక్రమం(May Day Program) ఘనంగా నిర్వహించారు. మే డే కార్మికుల దినోత్సవ జెండా ఎగరవేశారు. జిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ మాట్లాడుతూ.. మే డే కేవలం తేదీ కాదు, కార్మికుల రక్తంతో రాసిన చరిత్ర అని అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణే తమ లక్ష్యమని చెప్పారు. 19వ శతాబ్దంలో చికాగో వీధిలో ప్రారంభమైన ఈ పోరాటం ఫ్యాక్టరీ గోడల మధ్య నలిగిన కార్మిక గుండెల చప్పుడుగా ప్రపంచవ్యాప్తంగా గుండెలో చోటు సంపాదించింది అందుకే అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకునే రోజే మే 1న ప్రపంచవ్యాప్తంగా మే డే జరుపుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేతలు రూప్ సింగ్, సాయిలు, భూమయ్య, అనసూయ, సుమలత, శారదతో పాటు పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.