calender_icon.png 11 October, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న బంగారు గొలుసు బాధితులకు అందజేత

11-10-2025 12:00:00 AM

జనగామ, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : మార్గమధ్యలో పోగొట్టుకు న్న బంగారు నెక్లెస్ ను వెతికి పట్టుకొని బాధితులకు జనగామ పోలీసు లు అప్పగించారు. ఇన్స్పెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి  తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పుట్ట శ్రావణ్ కుమార్ అతని భార్య  అశ్విని మర్రి గడి గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై జనగామ ఓల్ బీట్ బజార్ నందు జ్యువెలర్స్ షాప్ వద్దకు వచ్చి తెగిపోయిన మూడు తులాల బం గారం నెక్లెస్‌కు మరమ్మతు చేయించి తీసుకువెళ్తున్నారు.

తెగిపోయిన. అశ్విని నెక్లెస్ ను తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టీ అట్టి బ్యాగ్ ను పల్సర్ బండి పై పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్య లో పడిపోయింది. వెంటనే జనగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సీఐ ఆదేశాల మేరకు ఎస్త్స్ర భరత్, క్రైమ్ సిబ్బంది. బి. కరుణాకర్ వెంటనే సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేసి బ్యాగును వెతికి పట్టి అందులో ఉన్న 3 తులాల బంగారు నెక్లేస్ ను  బాధితులకు అందజేశారు.