11-10-2025 06:10:08 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని దౌడేపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి దండేపల్లి మండలంలోని కోర్విచెల్మా గ్రామానికి చెందిన సౌటేపల్లి మౌళి (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడని ఎస్ఐ గోపతి సురేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడు రోజు మాదిరిగా శనివారం ఉదయం 4 గంటలకు తన భార్య తో వాకింగ్ వెళ్తానని చెప్పి వెళ్ళాడు.
ఎనిమిది గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతని జాడకోసం వెతకాగా డౌడేపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావి దగ్గర బైక్ పెట్టి వ్యవసాయ బావివద్ద చెప్పులు సెల్ ఫోన్ పెట్టి ఉన్నాయని తెలియడంతో బావిలో వెతకాగా మృతదేహాం లభ్యం అయిందన్నారు.మృత్తునికి భార్య సంజన10 నెలల వయస్సు గల జయరాం అనే కొడుకు ఉన్నారు. మృతుడు ఆర్థిక ఇబ్బధులతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అతని తండ్రి లచ్చన్న పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.