04-10-2025 01:33:33 AM
- ఐక్యవత్యంతో కార్యకర్తలు పని చేయాలి
- జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి
సిద్దిపేట, అక్టోబర్ 3 (విజయక్రాంతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పిటిసి స్థానాలలో అత్యధిక మెజార్టీ సీట్లు సాధించేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యతతో పనిచేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తే పార్టీ మరింత బలపడుతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పులు తీరుస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న రేవంత్ రెడ్డికి సిద్దిపేట జిల్లా నుంచి కృతజ్ఞతలు తెలిపారు. బి.ఆర్.ఎస్ పార్టీ మళ్లీ స్థానిక సంస్థల్లో గెలుపొందితే దోచుకునుడు తప్ప అభివృద్ధి జరగదని చెప్పారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంప మహేందర్, ముద్ధం లక్ష్మి, హరికృష్ణ, బొమ్మల యాదగిరి, సతీష్ గౌడ్, సాకీ ఆనంద్, ఎల్లం, రియాజుద్దీన్, ఖలీముద్దీన్, యాదగిరి, శంకర్, రామచంద్రం, బిక్షపతి, మీసం మహేందర్, కవిత, రజిని, సన, వాహబ్ తదితరులు పాల్గొన్నారు.