calender_icon.png 4 January, 2026 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ముందుకు సాగాలి

03-01-2026 02:40:58 PM

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్ (విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళలు అక్షరాస్యత సాధించే విధంగా ముందుకు సాగాలని, విద్యతోనే అసమానతలు తలుగుతాయని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ తో పాటు అదరపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్ వివిధ శాఖల అధికారులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఉత్తమ విద్యా బోధన చేస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు రాజేశ్వర్, పురుషోత్తం, హరిప్రసాద్, శ్రీనివాస్, సబిత, అప్పారావు, శ్రీరాములు, విజయ కుమారి పాల్గొన్నారు.