calender_icon.png 4 January, 2026 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు

03-01-2026 02:44:05 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీవాణి డిగ్రీ , పీజీ కళాశాల, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు, ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకుంటాము అని తెలుపుతూ, ఆమె భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త , మహిళా విద్యకు మార్గదర్శకురాలు, ఆమె గౌరవార్థం తెలంగాణలో మహిళా విద్యా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పలువురు పాల్గొన్నారు.