calender_icon.png 4 January, 2026 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయండి

03-01-2026 02:42:25 PM

అండగా ఉంటా 

రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర 

కేసముద్రం (విజయక్రాంతి): గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం, ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేయండి, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హామీ ఇచ్చారు. ఇనుగుర్తి మండలం చిన్యా తండా సర్పంచ్ గా ఇటీవల ఎన్నికైన జాటోత్ హరిచంద్ నేతృత్వంలో గ్రామ పాలక మండలి శనివారం హైదరాబాదులో రవిచంద్ర నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ హరి చందు ను ఎంపీ రవిచంద్ర సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ తన స్వగ్రామమైన ఇనుగుర్తి మండలంలోని గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా వెన్నంటి ఉంటానని ప్రకటించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడానికి హామీ ఇచ్చారు.