calender_icon.png 3 January, 2026 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సన్నాహక సమావేశం

03-01-2026 12:02:32 AM

నిజామాబాద్, జనవరి 2 (విజయ క్రాంతి): 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో భాగంగా ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న నందున నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ అధ్యక్షతన  శుక్రవారం సాయంత్రం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపూడి రవికుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ని గురుకుల కళాశాలలలో ఈ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.

విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా కళాశాలలకు విడతల వారీగా ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఫిబ్రవరి 21వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు సమయానికి హాజరయ్యే  విధంగా ఉదయం ఎనిమిదిన్నర వరకే సెంటర్లకు చేరే విధంగా బస్సులను నడపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యుత్ అధికారులు కూడా పరీక్షలు జరిగే సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి కోరారు. ఈ సమావేశంలో సీనియర్ ప్రిన్సిపాల్ కాలిక్ పాషా, శ్రీనాథ్, రాజీయుద్దీన్ అస్లాం, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.