03-01-2026 02:45:56 PM
-ఎమ్మెల్యే ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో ప్లకార్డులు పట్టుకొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేసిన విద్యార్థులు
మహబూబ్ నగర్,(విజయక్రాంతి) : నగర పాలక సంస్థ ప్రాంగణంలో మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో మహిళల ఆర్థిక-సామాజిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శిక్షణ నేర్చుకుంటున్న విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని ఎమ్మెల్యే సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు స్వయంగా కేక్ కట్ చేసి, మహిళా సాధికారతకు నిరంతరం తోడ్పడుతున్న ఎమ్మెల్యే తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.
మహిళలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆయన చేస్తున్న సేవలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రత్యేకంగా మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యక్రమం ద్వారా మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన కలిగే దిశగా ఎమ్మెల్యే గారు చూపిస్తున్న దూరదృష్టిని మహిళలు కొనియాడారు. ఆయన నాయకత్వంలో మహబూబ్ నగర్ మరింత ప్రగతి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, ఎమ్మెల్యేకు ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరిన్ని విజయాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.