19-11-2025 07:35:32 PM
ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని దొడ్ల గ్రామంలో ఉండబడిన సారలమ్మను, మల్యాలలో సమ్మక్కను కొండాయి గ్రామంలో గోవిందరాజులను, నాగులమ్మ వన దేవతలను బుధవారం దర్శించుకోనీ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత మినీ జాతరలో మంత్రి సీతక్క దేవుడి గుడికి వెళ్ళుటకు సిసి రోడ్, గుడి నిర్మాణం, గుడి కాంపౌండ్ వాల్, గుడి లోపల ప్లోరింగ్, టైల్స్ వేయించడం జరిగింది. అదేవిధంగా భక్తుల సౌకర్యం కోసం వాటర్ సదుపాయం ఏర్పాటు చేశారు.
మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మేడారం జాతర పనులు ఏ ఆటంకం లేకుండా జరగాలని దేవతలను మొక్కుకున్నారు. భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చేల వినయ్, జిల్లా యూత్ కార్యదర్శి ఎండీ గౌస్ పాషా, జిల్లా నాయకులు డబ్బకట్ల సత్యనారాయణ, గంపల శివకుమార్, ఉప సర్పంచ్ మహేష్ సర్దార్, ఠాగూర్, తిప్పనాపెల్లి రవీందర్, కమలక్క, తాటి పార్వతీర్, కౌసల్యా సుదర్శన్, మహేష్, నాగార్జున్, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.