calender_icon.png 19 November, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

19-11-2025 08:35:40 PM

నంగనూరు: మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రాజగోపాల్‌పేట పోలీసులు పట్టుకున్నారు. రాజగోపాలపేట గ్రామానికి చెందిన శివరాత్రి బాబు తన ట్రాక్టర్‌లో నంగునూరు వాగు నుండి ఇసుకను పాలమాకుల గ్రామానికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.బస్వాపూర్ గ్రామానికి చెందిన చామంతుల రాజు బస్వాపూర్ వాగు నుండి ఇసుకను బద్దిపడగ గ్రామానికి  తరలిస్తుండగా పట్టుబడ్డాడు. నిందితులపై కేసు నమోదు చేసి సిద్దిపేట కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై టి. వివేక్ తెలిపారు.మండలంలో అనుమతులు లేకుండా తీసుకొని తరలిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వివేక్ హెచ్చరించారు.అక్రమ ఇసుక రవాణకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు.