calender_icon.png 19 November, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధైర్యపడొద్దు అండగా మేముంటాం

19-11-2025 07:37:47 PM

మంగపేట (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని నిరుపేద కుటుంబానికి శ్రీరామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ & బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్ ఆర్థిక సహాయం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో ఇటీవల అనారోగ్య సమస్యతో మరణించిన గడదాసు పూర్ణ చందర్ కుటుంబాన్ని పరామర్శించి వారికీ 5వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించినామని శ్రీరామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ &బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మంపేట గ్రామ అధ్యక్షులు ఎగ్గడి అర్జున్,పూసల నర్సింహా రావు, చిలకమర్రి రాజేందర్, మునిగేల నరేష్, ఇందారపు రమేష్, సంతోష్, బాడిశ నవీన్ పాపక వెంకన్న, సత్యం, దుర్గం రాంబాబు, నర్సింహారావు ఉపేందర్ పాల్గొన్నారు.