calender_icon.png 19 November, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట మార్పిడితో రైతులకు అధిక లాభాలు

19-11-2025 07:34:38 PM

21వ విడత పి.ఎం కిసాన్ సమ్మాన్ నిధి నగదు బదిలీ ప్రత్యక్ష వీక్షణ కార్యక్రమం

కె.వి.కె ఇన్చార్జి శాస్త్రవేత్త డి నరేష్ 

గరిడేపల్లి,(విజయక్రాంతి): వ్యవసాయంలో రైతులు నూతన శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులతోపాటు లాభాలు పొందవచ్చునని కెవికె ఇన్చార్జి సీనియర్ శాస్త్రవేత్త డి నరేష్ అన్నారు.21వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నగదు బదిలీ కార్యక్రమం వీక్షణ సందర్భంగా గడ్డిపల్లి కెవికెలో బుధవారం రైతులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో జనాభా ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ పంటలు మార్పిడి చేస్తూ అధిక దిగుబడులు తద్వారా అధిక లాభాలు సాధించవచ్చునని అన్నారు.

రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా వరితో పాటు పండ్లు,కూరగాయలు,పెరటి కోళ్లు,చేపల పెంపకం చేపట్టడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చునని అన్నారు.రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సాధించాలని జీవన ఎరువులు, విత్తనాలు, పండ్ల మొక్కలు, అజోల్ల వరి కంపోస్ట్ వలన ఉపయోగాలు తెలిపారు. రైతులు హానికరమైన పురుగుమందులు వాడకాన్ని తగ్గించి ప్రకృతి విధి విధానాలను పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందుతూ పర్యావరణానికి మేలు చేసే విధంగా వ్యవసాయాన్ని చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సిహెచ్ నరేష్,ఏ కిరణ్, డి ఆదర్శ్,పి అక్షిత్,సుగంధి, నరేష్ ఇప్కో కంపెనీ మేనేజర్ వెంకటేశ్వర్లు రైతులు విద్యార్థులు పాల్గొన్నారు