calender_icon.png 19 November, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్త్రీ శక్తి దివాస్

19-11-2025 08:34:25 PM

చిట్యాల (విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) చిట్యాల శాఖ ఆధ్వర్యంలో ‘స్త్రీ శక్తి దివస్’ ను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ కార్యదర్శి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కొంపల్లి సూర్య మాట్లాడుతూ  భారత వీరనారి, అసమాన ధైర్యసాహసాల ప్రతీక రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం, ఆమె నాయకత్వం, త్యాగం, మాతృభూమి పట్ల ఉన్న అపార భక్తిని స్మరించుకున్నారు. అమ్మాయిలలో ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణాలను వెలికితీయడం సమాజం బాధ్యతగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు గణేష్. యశ్వంత్, ఫణింద్ర, శశి, కావ్య, మాధురి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ప్రతిధ్వనింపజేశారు.