calender_icon.png 2 December, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజకీయాలు మానుకోవాలి

02-12-2025 03:20:54 PM

సామాన్యులపై అరాచకాలు వద్దు: మాజీ ఎమ్మెల్యే రోహిత్

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని.. సామాన్యులపై అరాచకాలు చేయొద్దని... టిఆర్ఎస్ పార్టీ బలమేందో సర్పంచ్ ఎన్నికల్లో  చూపిస్తామని తాండూర్ మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు  భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువాలను వేస్తున్నారని ఆరోపించారు.

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పైలెట్ చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో వేడెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు తమ దౌర్జన్యం, రౌడీ రాజకీయాలను మానుకోవాలని, లేదంటే బీఆర్ఎస్ బలం ఏంటో చూపిస్తామని ...తాండూరులో కాంగ్రెస్ నాయకులు అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని .. తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి, బెదిరించి బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. పార్టీ అభ్యర్థులను కిడ్నాప్ చేసి, వారిపై దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై రోహిత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

ఇది పూర్తిగా ప్రజా నిర్ణయంతో జరిగే పంచాయతీ ఎన్నికలని, వాటిని అధికార బలంతో లొంగదీసుకునే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకుల కు హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తాను అండగా ఉంటానని మనోధైర్యాన్ని ఇచ్చారు.కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా సమావేశంలో పట్టణ శాఖ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నాయకులు సాయిపూర్ నరసింహులు,శ్రీనివాస్ యాదవ్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.