calender_icon.png 24 January, 2026 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఉద్యోగులను ప్రకటించిన సింగరేణి యాజమాన్యం

24-01-2026 09:31:03 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): 77వ గణతంత్ర దినోత్సవ సందర్భముగా కొత్తగూడెం ఏరియాలో ఎంపిక అయిన ఏరియా ఉత్తమ అధికారి & ఉద్యోగి (సెంట్రల్ ప్రోగ్రాం), గనుల వారిగా ఉత్తమ ఉద్యోగులను శనివారం సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం ఏరియాకుగాను (సెంట్రల్ ప్రోగ్రాం)కు ఏరియా ఉత్తమ అధికారిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ఎం.షాలేం రాజు, ఉత్తమ ఉద్యోగిగా బి. సురేష్ బాబు, ఎలక్ట్రీషియన్ (ఓసిపి), వికే ఓసి ఎంపిక అయ్యారు. 

గనుల వారి ఉత్తమ ఉద్యోగులుగా 1) కాంపల్లి వాసు, వైండింగ్ ఇంజన్ ఆపరేటర్, పద్మావతిఖని, 2) వళ్ళాల సాంబ మూర్తి , కోల్ కట్టర్, పద్మావతిఖని, 3) ఎం. రామ కృష్ణ ప్రసాద్, ఈపి ఫిట్టర్ కమ్ మెకానిక్, వికే కోల్ మైన్స్, 4) చిల్లపల్లి. రామకృష్ణ, సర్వేయర్, వికే కోల్ మైన్స్ 5) కుందూరు శ్రీనివాస్ రెడ్డి, కన్వేయర్  ఆపరేటర్, ఆర్.సి.హెచ్.పి ఎంపిక చేయడం జరిగింది. వీరినీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రుద్రంపూర్ ప్రొ. జయశంకర్ స్టేడియం లో ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం సన్మానించ నున్నారు.