calender_icon.png 28 September, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు గాలికొదిలిన కాంగ్రెస్..

28-09-2025 05:06:25 PM

బాకీ కార్డు పంపిణీతో ఎండగడుతున్న జగదీశ్ రెడ్డి

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రజల ముందుంచిన ఎమ్మెల్యే

చివ్వెంల (విజయక్రాంతి): ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామంలో ఆయన ఆదివారం ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను ప్రజల చేతికి అందించారు. ఈ కార్డులో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు, వాటి ప్రస్తుత స్థితి స్పష్టంగా పొందుపరచబడ్డాయి. “కాంగ్రెస్ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల ఆశలను వమ్ము చేశారు. ఈ బాకీ కార్డు ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేర మోసం చేసిందో తెలుస్తుంది” అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, ఎక్స్ జెడ్పిటిసి రౌతు నరసింహారావు, ఎక్స్ ఎంపీపీ కుమారి బాబు,  ఎక్స్ సర్పంచ్ శైలజ నాగయ్య, ఎర్రబోయిన శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.