28-09-2025 05:27:58 PM
దౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో బిఆర్ఎస్ యువజన నాయకుడు నర్రా రాజేందర్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను మాజీ ఎంపీటీసీ గన్నమనేని మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, జట్టు భావన పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.