calender_icon.png 28 September, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లపై "రచ్చబండ పే చర్చ"

28-09-2025 05:20:25 PM

వలిగొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకై జడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ ప్రక్రియను శనివారం నాటితో ముగించారు. కాగా ఏ గ్రామానికి, ఏ వార్డుకు, ఏ జిల్లాకు రిజర్వేషన్లు తెలియడంతో వివిధ పార్టీలలోని ఆశావాహులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు గ్రామాల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్లపై రచ్చబండ పే చర్చలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ శనివారం ముగియడంతో ఆదివారం రోజు తెల్లవారుజాము నుండి జనం రచ్చబండల వద్ద చాయ్ తాగుతూ రిజర్వేషన్లు ప్రకటించడంతో ఏ పార్టీ నుండి ఎవరు నిలబడతారు అని ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది. దీనితో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే దసరా పండుగ ముందే రిజర్వేషన్ రావడంతో ఆశావాహులు ఎన్నికల కంటే ముందే ఖర్చులు పెరిగే అవకాశం ఉందని లోలోన మదన పడుతున్నారు.