calender_icon.png 28 September, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషాదం మిగిల్చిన భారీ వర్షం..

28-09-2025 05:31:56 PM

జీవన్గిలో 110 ఆవుల జల సమాధి

తెగిపోయిన కోకట్ బ్రిడ్జికి మరమ్మత్తులు

తాండూరు (విజయక్రాంతి): గత మూడు రోజుల నుండి కురిసిన భారీ వర్షం బషీరాబాద్ మండలం జీవనగిలో విషాదాన్ని మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం బీభత్సంతో ఉగ్రరూపం దాల్చి తాండూర్ లోని  కాగ్నా నది పొంగిపోర్లిన కారణంగా బషీరాబాద్ మండలం జీవనగి గ్రామంలోని గోశాలలో 110 ఆవులు జల సమాధి అయ్యాయి. మహబూబ్నగర్ మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డికి చెందిన గోశాలలో సుమారు 110 గోవులతో కూడిన గోశాల ఆ గ్రామంలో కొనసాగుతోంది. కాగ్న నది వరదతో నీట మునిగిన గోశాలలో తాళ్ళకు కట్టేసిన చోటే గోవులన్నీ జలసమాదయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన గ్రామస్తులను తీవ్రంగా కలిచి వేసింది. మరోవైపు భారీ వర్షం దాటికీ కొట్టుకపోయిన యాలాల మండలం కోకట్ బ్రిడ్జికి ఆర్ అండ్ బి శాఖ అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. వర్షానికి చేతికొచ్చిన పంటలన్నీ పాడయ్యాయని, ప్రభుత్వం ఆదుకొని తమకు పంట నష్టపరిహారం అందించాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.