calender_icon.png 28 September, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవి పంది మాంసంతో నలుగురు అరెస్టు

28-09-2025 05:24:28 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాశిరెడ్డి పల్లి గ్రామంలో అడవి పంది మాంసంతో నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు కాసిరెడ్డిపల్లి గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో అడవి పంది మాంసంతో గంధం రాజన్న, సిరిగిరి సాయి దొరికారు. వీరిని విచారించగా కన్నాల గ్రామానికి చెందిన ముస్కె శ్రీనివాస్ రెండు చనిపోయిన అడవి పందులను అప్పగించినట్లు చెప్పారు. ఈ విచారణలో ముస్కె శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ నెల 27న సాయంత్రం జంగేపల్లి చంద్రమోగిలి పత్తి చేనులో కరెంటు వైర్లు అమర్చి రెండు అడవిపందులను చంపారు. ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని, అడవిపంది మాంసా న్ని స్వాధీనం చేసుకొని నిందితులను రేంజ్ ఆఫీస్ కి తరలించారు. ఈ దాడి లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జై తిరుపతి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గౌరీ శంకర్, గోపికృష్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గోపికృష్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి రాజు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిహెచ్ భాస్కర్ పాల్గొన్నారు.