28-09-2025 05:50:38 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కలిసికట్టుగా ఉందాం.. మన అభ్యర్థులను గెలిపించుకుందామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు ఎవరికి బీ ఫామ్ ఇచ్చినా వారిని గెలిపించుకుందామని తెలిపారు. ఎమ్మెల్యే మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించుకుందామని తీర్మానం చేశారు. ఎవరికి బీ ఫామ్ ఇచ్చిన అభ్యంతరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జూకంటి వెంకట్ రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, అంబీర్ శ్యాం రావు, రూప్ సింగ్, షౌకత్ అలీ, వెంకట్ రెడ్డి,మేకల రాజు, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.