28-09-2025 05:48:43 PM
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రధానమంత్రి మోడీ జన్మదిన ఉత్సవాలలో సేవా పక్షం భాగంగా ఆదివారం విశిష్ట వ్యక్తుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజన్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర గుప్తా హాజరయ్యారు. ఈ మేరకు తాండూరు నియోజకవర్గంలో వివిధ రంగంలో ఉత్తమ సేవలందిన సుమారు 50 మంది విశిష్ట వ్యక్తులకు సన్మానించి సత్కరించారు.