calender_icon.png 14 September, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

21-07-2024 01:42:25 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభంగా జరుగుతున్నాయి. లష్కర్ బోనాలతో ఉజ్జయిని మహంకాళి ఆలయం సందడిగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉజ్జయిని మహంకాళికి మొదటి బోనం సమర్పించారు. మంత్రి సీతక్క అమ్మవారిని దర్శించు కున్నారు. సీఎస్ శాంతి కుమారి అమ్మవారికి బోనం సమర్పించారు. బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ మల్లారెడ్డి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి  మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.