calender_icon.png 14 September, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు అధైర్య పడొద్దు... ప్రతి రైతుకు యూరియా అందిస్తాం...

14-09-2025 07:39:48 PM

శివంపేట్ పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరాంరెడ్డి..

శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట్ ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రతి రైతుకు యూరియా అందిస్తామని చెప్పారు. మండలంలో 23 వేల ఎకరాలు  రైతులు వరి కందులు మొక్కజొన్న పత్తి  వేశారు. రైతులు 19500 ఎకరాల వరి వేయడం జరిగింది. పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 23,300 బస్తాల యూరియా (1048 మెట్రిక్ టన్నులు) రైతులకుఅందజేశామన్నారు.రైతులు ప్రతి ఎకరాకు ఒక బస్తా యూరియా వాడాలని చెప్పారు.