calender_icon.png 25 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

25-09-2025 12:28:41 AM

* పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు 

సుల్తానాబాద్, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి):అభివృద్ధి , ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నా రు, బుధవారంసుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులను సుల్తానాబాద్ పట్టణం, మండలానికి చెందిన 96 మంది లబ్ధిదారులకు రూ.96 లక్షల 11 వేల 136 ల విలువగల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆర్థికంగా వొడిదుడుకులను ఎదుర్కొంటూనే అభివృద్ధి , ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ, సన్నవడ్లపై బోనస్, కటింగ్ లు లేకుండా వడ్ల కొనుగోలు, మానేరు నుండి ఇసుక పంపిణీ సులభతరం, లారీలో ఇసుక తరలింపు నిలిపివేసి భూగర్భ జలాల పెంపుకు రైతులకు పరోక్ష సహాయం వంటి ఎన్నో ప్రజా ఉపయోగ పనులను తాము అందించడం జరుగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వినుపాల ప్రకాష్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరీ మహేందర్, నాయకులు దన్నాయక్ దామోదర్ రావు , పన్నాల రాములు,, బిరుదు కృష్ణ , పడాల అజయ్ గౌడ్ , బండారి రమేష్ , ఉస్తం గణేష్ పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.