25-09-2025 12:28:43 AM
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పూర్వ వైభవానికి తీసుకువచ్చే దిశగా గ్రామ పాలన అధికారులు, లైసెన్స్ సర్వేయర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో వారధిగా పనిచేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని హాలులో కొత్తగా నియమితులైన అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూభారతి చట్టం అమలు, భూసరిహద్దుల పరిరక్షణ, రికార్డుల నిర్వహణలో జీపీఓలు, సర్వేయర్ల పాత్ర కీలకమని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించేలా అవినీతి రహిత, పారదర్శక సేవలు అందించాలని సూచించారు.