calender_icon.png 25 September, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోపిస్తున్న పారిశుధ్యం

25-09-2025 12:27:58 AM

పట్టించుకోని  అధికారులు పెరుగుతున్న దోమలు, వ్యాపిస్తున్న దుర్గంధం

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 24 (విజయక్రాం తి) : ఘట్ కేసర్ మున్సిపాలిటీలో దోమల బెడద తీవ్రరూపం దాల్చింది. దోమల సమస్యలో పట్టణంతో పాటు పలు గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాయంత్రం అయితే చాలు బయట ఉండలేని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్యం లోపంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

జనాలకు దోమల బెడద కంటికి నిద్రలేకుండా చేస్తున్నది. మూసీ మురికి నీటితో నిండిన చెరువులు, నారాయణరావుచానల్ పరిసర గ్రామాల్లో సమస్య అధికంగా ఉంది.  అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా దోమల సమస్యపై చర్యలు తీసుకోవడం లేదని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం మండలంలోని 11 గ్రామపంచాయతీలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది.

కాగా ప్రత్యేక అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని సమస్యలు తెలియజేస్తే గ్రామ కార్యదర్శులు తమకు అధికారం లేదని ప్రత్యేక అధికారులను తెలియజేయాలని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులకు ఒక సారి కూడా ప్రత్యేక అధికారులు గ్రామాల సందర్శనకు రావడం లేదని మాజీ సర్పంచులు అంటున్నారు. పలు గ్రామాల్లో గ్రామం చివరన డ్రైనేజీ నీటితో పెద్ద మురికి కుంటలు ఏర్పడి దోమలకు ఆవాసంగా మారుతుంది.

ఎరుమల్లెవాగులో వేస్తున్న చెత్త చెదారంతో పందులు స్త్వ్రర్యి విహారం చేస్తున్నా యి. దీంతో ఘట్ కేసర్ పరిసర కాలనీలు, గ్రామాల్లో దోమల తీవ్రత అధికంగా ఉంది. గ్రామాల్లో పారిశుధ్య చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీ సిబ్బంది చెబుతున్నా దోమల సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాకింగ్ యంత్రాలు కొన్ని నాటి పంచాయతీల్లో ఉన్నప్పటికి నిర్వహణ లేక మూలన పడేశారు.

గ్రామాలు, కాలనీల్లో ఫాకింగ్ చేస్తున్నామని గ్రామసభలో చెబుతున్న ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. నామ మాత్రంగా ఫాకింగ్ యంత్రం శబ్దం చేసి మొక్కుబడి చర్యలు చేపడుతున్నారు. ఘట్ కేసర్, శివారెడ్డిగూడ, చౌదరిగూడ, సాదత్‌అలీగూడ, మక్తా, ఘణాపూర్, వెంకటాపూర్, తెనుగూడెం, చందుపట్లగూడ, బొక్కోనిగూడ, లింగాపూర్, ఫకీర్ టెక్యా, ఎన్‌ఎఫ్ సీనగర్, కొండాపూర్, మాదారం, మర్పల్లిగూడ గ్రామాల్లో దోమల బెడద ఎక్కువై జనాలు రోగాల భారిన పడుతున్నారు.

దోమలతో పొంచి ఉన్న రోగాలు

అనాఫిలిస్ దోమ కాటుతో మలేరియా, చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. దోమ కాటుతో పలువురు డెంగీ జ్వరం సోకి విషమంగా మారి మరణించిన సందర్భాలు ఉన్నాయి. దోమల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నా గ్రామాల్లో ఏమి చేయలేని పరిస్థితీ నెలకొంది. మురుగు గుంతలు, కంపచెట్లు, పిచ్చిమొక్కలు, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు నివాసం ఏర్పరచుకుంటున్నాయి.

గుడ్డు లార్వా వ్యూపా వృద్ధి చెంది దోమగా మారి ప్రజల రక్తాన్ని పీల్చుతున్నాయి. ఘట్ కేసర్ మున్సిపల్ లో గతంలో నీటి కుంటల్లో ఆయిల్ బాల్స్ వేసినప్పటికి దోమలు తగ్గడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి దోమల సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

తీవ్ర దుర్గంధం 

ఘట్ కేసర్ పట్టణంలోని చిత్తాచదారం ఎరుమల్లె వాగులో మున్సిపల్ సిబ్బంది డంపింగ్ చేయడంతో వాగు విస్తీర్ణం కుచించుకుపోవడంతో పాటు తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో  సమీపంలోని నివాసాల ప్రజలు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు అనారోగ్యాల పాలవుతున్నారు. 

విప్పర్ల హనుమాన్,  బిజెపి నాయకుడు చెత్తాచెదారం

మున్సిపల్ సిబ్బంది ఎరుమల్లె వాగులో చెత్తాచెదారం వేయకుండా అధికారులు చర్యలు తీసుకొని దోమల సమస్యకు పరిష్కారం చూపాలి. 

- పోత్నకని మల్లికార్జునరాజు, బిఆర్‌ఎస్ నాయకులు