calender_icon.png 27 July, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హసీనా ప్రభుత్వం కూల్చివేత వెనుక అమెరికా హస్తం ?

06-08-2024 05:41:42 PM

ఢాకా: బంగ్లా దేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం వదలి వెళ్లిపోవడం వెనుక అమెరికా కుట్ర ఉందనే ప్రచారం సోషల్ మీడియా లో మొదలైంది. మే నెలలో హసీనా చేసిన ప్రకటననే పరిశీలిస్తే చాలని అంటున్నారు. బంగ్లాదేశ్ లో వైమానిక స్థావరం ఏర్పాటుకు ఒక దేశానికి  అనుమతి ఇస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేట్లు చేస్తానని ఆఫరిచ్చిందని ఆమె నర్మ గర్భంగా వ్యాఖ్యానించడాన్ని రాజకీయ పరిశీలకులు ఉటంకిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.