06-08-2024 05:14:39 PM
ఢాకా: బంగ్లాదేశ్ లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ బంగ్లా పార్లమెంటును రద్దు చేశారు. త్రివిధ దళాలు, పార్టీల నేతలతో చర్చలు జరిపిన షాబుద్దీన్ బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. నోబెల్ గ్రహీత యూనస్ సారథ్యంలో ఉద్యమకారులు తాత్కాలిక ప్రభుత్వం కోరుతున్నారు. అధ్యక్షుడు షాబుద్ధీన్ శాంతిభద్రతలు పునరుద్ధరించాలని సైన్యాన్ని కోరారు.