10-07-2025 01:24:35 AM
న్యూఢిల్లీ, జూలై 9: రాజకీయ జీవితం నుంచి వైదొలిగిన తన భవిష్యత్తు కార్యచరణపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహాకార సంఘాల మహిళలతో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, శరీరాన్ని వ్యా ధులకు దూరంగా ఉంచడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని తెలి పారు. ఇక సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం అద్భుతంగా ఉందన్నారు.