పోలీసు అధికారుల ఆధ్వర్యంలో కానిస్టేబుల్ సాయి అంత్యక్రియలు
14-08-2026 12:00 AM
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఎల్బి నగర్ ఏసీపీ ఆఫీసులో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జరుపుల సాయికుమార్, బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్వగ్రామమైన అజ్ఞన తండా, బండలేమూరు గ్రామం, మంచాల మండలంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.పి. వి రాజు ఆధ్వర్యంలో, మంచాల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ.మధు, ఎస్‌ఐ వంశీ పోలీసు సిబ్బంది. అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. సాయికుమార్ పట్ల పోలీసు శాఖకు ఉన్న ఆత్మీయత, గౌరవాన్ని చాటుతూ కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంచాల పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.






