23-01-2025 12:00:00 AM
బంజారభాష భారతదేశంలోని ప్రాచీ న భాషలలో ఒకటి. కానీ, లిపి లేని కారణం గా నిర్లక్ష్యానికి గురవుతూ, అంతరించిపోయే దశలో ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశం లో మాతృభాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రపంచీకరణ, సరళీకృత, ఆర్థిక విధానాలు ఒకవైపు, మరోపక్క అమెరికన్ సామ్రాజ్యవాద సంస్కృతి తాకిడికి బలవుతున్న మాతృభాషల ఉనికి, మనుగడ మరోవైపు కనుమరుగవక తప్పని దుస్థితి నెలకొంది.
బంజారాలు మాట్లాడే ‘గోర్-బోలి’ భాష కు నేటికీ గుర్తింపు లేదు. లిపి లేదు. వీరు మాట్లాడే భాషలు మౌఖికంగా నోటికే పరిమితం కావడం మూలాన అత్యంత నిరాద రణకు గురవుతున్నాయి. పర్యవసానంగా బంజారా తెగల ప్రత్యేక సాంస్కృతిక సాం ప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. మ న దేశంలో మొత్తం 1,652 భాషలుండగా గిరిజనులు మాట్లాడే భాషలే సుమారుగా 600 దాకా ఉన్నాయి.
మన రాజ్యాంగం ఇప్పటికి 22 భాషలను అధికారికంగా గుర్తించగా, వాటిలో గిరిజనులు మాట్లాడే మణి పురి, డోంగ్రీ, బోడో, కొంకిణి, సంథాలీ భాషలకు మాత్రమే చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా దాదాపుగా 20 రాష్ట్రాలలో నివసిస్తున్న బంజారాలు సుమారు 18 కోట్ల జనాభా ఉంది.
దేశంలో హిందీ తరువాత అత్యధికంగా తమ సంప్రదాయ భాష గోర్‌బోలిని మాట్లాడుతున్నారు. కానీ ఇంతటి సమూహం కలిగిన ఈ లంబాడీ భాషకు రాజ్యాంగ గుర్తింపు లేకపోవడం బాధాకరం. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది అంతరించే దశలో ఉండటం కొసమెరుపు.
ప్రత్యేక స్కూళ్లు పని చేయడం లేదు
భాష ద్వారానే సంస్కృతీ సాంప్రదాయా లు, ఆచారాలతో బంజారాలు తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. కానీ, పాలక వర్గాలు దీనితోపాటు కొన్ని రకాల తెగల భాషలకు లిపి లేదన్న సాకుతో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇతర భాషలను వారిపై రుద్దడంతో విద్యాభివృద్ధికి, సమగ్రాభివృద్ధికి వారు దూరమవుతున్నారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన తరువాత ఆదివాసీ, గిరిజన విద్యార్థులమీద తెలుగును బలవంతంగా రుద్దారు.
ఉమ్మడి రాష్ట్ర ప్రభు త్వం గత పదేళ్ల క్రితం రాజీవ్ విద్యామిషన్ (ఆర్‌వీఎం)ద్వారా బంజార భాషలో తెలుగు లిపితో 1వ తరగతి నుంచి 5వ తరగతి వర కు వాచకాలను ముద్రించి, ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి ఆయా భాషా సంబంధ బోధకులను కూడా నియమించింది. ఇలా కొంత ప్రయత్నం చేసినా, కొన్ని సాంకేతిక లోపాలవల్ల నేడు ఆ పాఠశాలలు పని చేయడం లేదు.
భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గోర్-బోలి భాషను చేర్చలన్న డిమాండ్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ నెరవేరకుండా ఉంది. గోర్-బోలి భాష మా త్రమేకాదు, అది బంజారాప్రజల ఆత్మ వం టిది.
ఒక జాతి ఎప్పుడైతే తన భాషను పరంపరలో మరచిపోతుందో, తదనంతర కాలం లో భాషతోపాటు జాతికూడా అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి రాజ్యాంగ హోదా కల్పించాలని ఒక రిపోర్టు పూర్వ మహారాష్ట్ర సీఎం వీపీ నాయక్ సమర్పించారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యుల్‌లో గోర్-బోలి భాషను చేర్చడం ద్వారా బంజారాల న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
జటావత్ హనుము