19-08-2025 11:11:43 PM
చౌటుప్పల్,(విజయక్రాంతి): చౌటుప్పల్ మండల పరిధిలోగల పరిశ్రమలో సబ్సిడీ యూరియా ఇతర పరిశ్రమలకు తరలించే చర్యలు అరికట్టడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ ,వ్యవసాయ శాఖ ,పోలీస్ శాఖ మరియు పరిశ్రమల విభాగం ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండల పరిధిలోగల పరిశ్రమలను తనిఖీ చేయడం జరిగింది.
ఇందులో భాగంగా మండలంలో మా అగ్రి సైన్స్, భారత్ పేస్ట్ కేమ్, యస్అగ్రికేర్ పురుగుమందులు, ఎరువుల తయారీ పరిశ్రమల్లో పటిదార్ ఇండస్ట్రీస్ ఆరెగూడెం లో తనిఖీ చేశారు. ఇందులో ముఖ్యంగా యూరియా నిలువలు పరిశ్రమ లో ఎక్కడనైనా నిల్వ ఉంచారా అని తనిఖీ చేసి ముఖ్యంగా పరిశ్రమలు సబ్సిడీ యూరియా నిల్వచేసి నట్లైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా లైసెన్సులు రద్దు చేస్తామని తెలియజేశారు. అలాగే రైతులకు సంబంధించిన సబ్సిడీ యూరియా అవసరాల మేరకు అందుబాటులో ఉందని తెలియజేశారు.