07-05-2025 01:14:49 AM
భద్రాద్రి కొత్తగూడెం మే 6 (విజయ క్రాంతి)జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల అన్నింటిలో వారంలోగా ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లాలో పురోగతిలో ఉన్న ఇంకుడు గుంతల నిర్మాణం, పామ్ పౌండ్స్ నిర్మాణాలు ,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలపై అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తాసిల్దార్ లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలు మరియు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు తదితర అన్ని కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు నిర్మాణాలు విస్తృతంగా చేపట్టాలన్నారు.ప్రతి ఎకరానికి ఐదు ఇంకుడు గుంతలు అర ఎకరానికి మూడు ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలన్నారు.
ఎక్కడైతే వర్షం నీరు నిలువ ఉంటాయో గుర్తించి అటువంటి చోట ఎక్కువ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలను లను పంచాయతీ సెక్రటరీలు జల్ సెంచెయ్ జెన్ భాగీ దారి పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు.
జెల్ సoచెయ్ జన్ భాగీదారి లో దేశంలోనే మొదటి స్థానంలో జిల్లాను నిలపాలని అధికారులు ఆదేశించారు.వచ్చేవారం నుండి వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని వ్యవసాయానికి యోగ్యమైన భూముల్లో నీటి కుంటల నిర్మాణానికి మార్కింగ్ పూర్తి చేయాలన్నారు.