calender_icon.png 7 May, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం మారినా జర్నలిస్టు సమస్యలు పరిష్కారం కావట్లేదు

07-05-2025 01:17:00 AM

  1. హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు వెంటనే ఇవ్వాలి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవన్నయ్య

భద్రాద్రి కొత్తగూడెం మే 6 (విజయ క్రాంతి)   రాష్ట్ర ప్రభుత్వాలు  మారిన జర్నలిస్ట్ ల సమస్యలను పట్టించుకోవడంలేద ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బి బసవ పున్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు.  వెంటనే ఇండ్ల స్థలాలు,హెల్త్ కార్డులు, అక్రిడియేషన్స్ ఇవ్వాలని డి మాండ్ చేశారు. మంగళవారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో టిడబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాళ్ల బండి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బసవ పున్నయ్య   ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లో జర్నలిస్టులు  ప్రాణాలు తెగించి ఉద్యమంలో ముందుభాగాన నిలిచారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వచ్చిన  ప్రభుత్వాలు జర్నలిస్టు సమస్యలను విస్మరించి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాయన్నారు. హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో  ఇవ్వకపోవడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు 500 మంది జర్నలిస్టులపైగా చనిపోయారన్నారు.

మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు వృత్తి పరమైన బాధ్యతలు పెరిగినప్పటికీ వారికి సామాజిక భద్రత లేకుండా పోయిందన్నారు. వారి పై జరుగుతున్న దాడులకు వెంటనే రక్షణ చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. మృతి చెందుతున్న వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా ప్ర భుత్వం చర్యలు చేపట్టాలని, హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో  అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలని డి మాండ్ చేశారు.

జర్నలిస్టు సైతం వారి వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపులు పొందాలని, పేదల పక్షాల నిలబడి ప్రభుత్వ పథకాలు వారికి అదే విధంగా వార్త కథనాలు ప్రచురించాలని, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండ కట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీని యర్ జర్నలిస్ట్ ,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈ. చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. రాజశేఖర్  ఖమ్మం జిల్లా  కార్యదర్శి కె. శ్రీనివాసరెడ్డి,  దిశ రిపోర్టర్ సతీష్,  దాసరి వెంకటేశ్వరరావు, రాళ్ల బండి కృష్ణమూర్తి కొండ్రు వేణు, దమ్మాలపాటి  వెంకన్న  తదితరులు పాల్గొన్నారు.