calender_icon.png 7 July, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడుప్పల్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభం

07-07-2025 01:42:40 AM

మేడిపల్లి జూలై 6: బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు ఆదివారం భూమి పూజ చేశారు. మున్సిపా లిటీలోని 21 డివిజన్ పరిధిలో మాజీ మేయ ర్ తోటకూర అజయ్ యాదవ్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు పోగుల నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషో ర్ గౌడ్ , ఇందిరమ్మ కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ భూక్య సుమన్ హాజరై లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాకే పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీసభ్యులు జ్ఞానేశ్వర్, వెలిగొండయ్య, గోవిందచారి, నా యకులు పూల ప్రకాష్, నరేందర్ రెడ్డి, చం ద్రం గౌడ్, సునీల్, పరశురాములు, పాండు తదితరులు పాల్గొన్నారు.