07-07-2025 01:41:36 AM
మేడ్చల్, జూలై 6(విజయ క్రాంతి): మేడ్చ ల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిరుమల విడోస్ కాలనీ లో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విన్నవించారు. ఆదివారం కాలనీవా సులతో వెళ్లి మంత్రికి వినతిపత్రం అందజేశారు.
కనీస సదుపాయాలు లేక కాలనీవా సులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి మంత్రికి వివరించారు. సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు మంద సంజీవరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కొత్త చక్రపాణి గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.