13-05-2025 10:15:37 PM
బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్...
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ముస్లిం మైనార్టీలు సోదరులు పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్(ACP Ravikumar) అన్నారు. మంగళవారం తాండూర్ సీఐ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు ప్రజలందరూ ఐకమత్యంతో జరుపుకోవాలని అన్నారు. కులమత బేధాలు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
బక్రీద్ పండుగ వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా ముస్లిం మత పెద్దలతో కలిసి ఈ శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల రక్షణ కొరకు తమ పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఏదైనా సమస్యలు ఉన్న తక్షణమే పోలీసు వారికి లేదా (డయల్ 100) కి సమాచారం అందించాలన్నారు. ఈ ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, మాదరం ఎస్సై సౌజన్య, ముస్లిం మత పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.