30-07-2025 11:21:18 PM
మంథని (విజయక్రాంతి): కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా మండల కేంద్రానికి చెందిన సయ్యద్ సయీద్ అన్వర్ ను నియమిస్తూ పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే నియామక ఉత్తర్వులను అందజేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన వైనాల రాజును ఇటీవలే కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడంతో మండల కాంగ్రెస్ పార్టీ ఖాళీ ఏర్పడింది. దీంతో మండల కన్వీనర్ గా ఉన్న అన్వర్ ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు మక్కన్ సింగ్ ఉత్తర్వులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపియంగా పనిచేస్తానని అన్నారు. తన నియమకానికి కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు, శీను బాబుకు, తొట్ల తిరుపతి యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపిటిసి దామోదర్, అంబిరి శ్రీనివాస్, కొలిపాక సుజాత, జంగిల్ కుమార్, ఇనగంటి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.