calender_icon.png 30 July, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ముంచుతున్నారు!

14-05-2025 12:00:00 AM

  1. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పేరుతో నిలువు దోపిడీ
  2. క్వింటాలుకు ఆరు కిలోల వరకు ఎక్కువ తూకం
  3. మండిపడుతున్న రైతులు
  4. ఎర్రచింతల్లో అధికారుల నిర్బంధం

నిర్మల్ మే 13 (విజయక్రాంతి) : ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన వారి దానం కొనుగోలలో గోల్మాల్ జరుగుతుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర వస్తుందని ఆశపడి వరి ధాన్యం విక్రయిస్తున్న  విక్రయిస్తున్న రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొనుగోలు నిబంధనలు అతిక్రమించి వారి ధాన్యం ఎక్కువగా రూపం వేస్తున్నట్టు రైతులు పేర్కొంటున్నారు.

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఈ అక్రమ దందా కొనసాగుతున్న అధికారులు మాత్రం తమకేమని పట్టనట్టు వివరించడంతో రైతులు తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఈ ఏసంగి సీజన్లో సాగునీటి వనరుల కింద లక్ష ఇరవై వేల ఎకరాల వరకు వరి సాగు చేసినట్టు అధికారులు చెప్పారు. ప్రభుత్వం వరి ధాన్యం సాగు చేసిన రైతులకు మద్దతు ధర కల్పించేందుకు జిల్లాలో  308 ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో డిఆర్డిఏ ఐకెపి డీసీఎంఎస్ గిరిజన కోపరేటివ్ సొసైటీ పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోల ప్రక్రియను ప్రారంభించారు.

జిల్లావ్యాప్తంగా ఆయా మండల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో వరదలకు కొనుగోలను చేపట్టిన ప్రభుత్వం క్వింటాలకు ఏ గ్రేడ్ ధాన్యానికి రూపాయలు 20 80 చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు 50 వేలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా కొనుగోలు కేంద్రాల్లో నిర్వాకులు రైతుల వద్ద నుంచి నిబంధనలను అతిక్రమించి ఎక్కువ ధాన్యాన్ని తూకం చేస్తున్నట్టు రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు.

క్వింటాలుకు 6 కేజీల చొప్పున ధాన్యం ఎక్కువ తూకం వేస్తున్నారు. ఓ బస్తాకు 40. 500 కేజీల ధాన్యాన్ని తూకం వేయవలసి ఉండగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 వరకు కేజీల ధాన్యాన్ని బస్తాకు తూకం వేస్తున్నట్టు వారి విక్రయించే రైతులు బహిరం గంగానే చెప్తున్నారు. యాసంగిలో రైతులు పండించిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దాన్యాన్ని తరలిస్తే తేమశాత  పరిశీలిం చి బస్తాకు 40. 500 గ్రాముల వారి ధాన్యం తూకం వేయవలసి ఉండగా అదనంగా రెండున్నర కిలోలు ధాన్యాన్ని ఎక్కువగా తూకం వేస్తున్నట్టు రైతులు పేర్కొంటున్నారు.

క్వింటాలు ధాన్యం కు 6 కిలోల నుంచి ఏడు కేజీల వరకు ఎక్కువగా ధాన్యం జూక డం వల్ల తమకు 150 రూపాయల వరకు నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. దీనిపై రైతులు అభ్యర్థులను తెలిపితే కొనుగోలు చేసే నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తు న్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చులు సాగునీటి ఇబ్బంది నేపథ్యంలో ఆర్థికంగా నష్టపో యిన రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రా లు నిర్వాహకులు కూడా మోసం చేయడం తో తమ పరిస్థితి ఏంటని రైతులు అధికారులకు మొరపెట్టుకుంటున్న ఇవి తాత్కాలిక చర్యలు తప్ప శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని రైతులు నిట్టూరుస్తున్నారు. 

అనేక గ్రామాల్లో ఫిర్యాదులు

నిర్మల్ జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై రైతులు అనేక గ్రామాల్లో అధికారులకు ఫిర్యాదు చేస్తున్న అధికారులు మాత్రం క్షీరా మామూలుగానే తీసుకుంటున్నారు. మూడు రోజుల క్రితమే నిర్మల్ మండలంలోని మూఠాపూర్ సోను మండలంలోని సూన్ మండలంలోని బొప్పారం కుంటాల మండలంలోని ఓలా లోకేశ్వరం సారంగాపూర్ మండలంలోని వివిధ గ్రామా ల్లో  వరి ధాన్యం తూకాలు జరుగుతున్న మోసాలపై జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

తాజాగా ఖానాపూర్ మండలంలోని ఎర్ర చింతల్ పిఎసిఎస్ కొనుగోలు కేంద్రంలో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 43 కేజీల వారి ధాన్యం తూకం వేయడంపై మండిపడ్డ రైతులు అక్కడి సీఈఓ భూమి ఆశన్న నిర్వాకులు సాయికుమార్ ను ప్రభుత్వ పిఎసి కొనుగోలు కేంద్రంలో నిర్బంధించి రైతులు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడి అధికారులను నిర్బం ధం నుంచి విడిపించారు.

మూడు రోజుల క్రితం కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలు లేకపోవడం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు పిఎసిఎస్ సీఈఓ లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సస్పెండ్ చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పెరిగి పోవడంతో కూలీలు లారీల కొడతా అధికంగా ఉండడంతో కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యం తూకం ట్రాన్స్పోర్ట్ నివారణ లో రైతుల వద్ద నుంచి డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.

గతంలో క్వింటాలకు తూకం లోడింగ్ తదితర పనులకు 24 రూపాయలు క్వింటాలకు తీసుకుంటుండగా ఇప్పుడు రూపాయ లు 40 రూపాయల వరకు పెంచినట్టు రైతు లు ఆరోపిస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం విక్రయించుకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వెళ్తే వారం నుంచి 15 రోజుల వరకు సమయం పట్టడం వాతావరణ పరిస్థితులు మారి వర్షాలు కురవడంతో పంట ను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

దీంతో రైతులు తమకు ఆర్థికంగా నష్టం జరిగినా తమ పంట విక్రయిస్తే చాలు అనుకుంటూ కొన్ని కేంద్రాల్లో ఫిర్యాదులు కూడా చేయకుండా మానసిక ఆవేద నకు గురవు తున్నారు. కూలీ డబ్బులు ఎక్కువ తూకంపై ఫిర్యాదు చేస్తే అటువంటి రైతులను కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తేమ నాణ్యత పేరుతో ఇబ్బందికి గురి చేయ డం భవిష్యత్తులో మరింత కష్టాలు ఎదుర య్యాయని భావిస్తున్న రైతులు కళ్ళ ఎదుట నష్టం జరుగుతున్న నిన్నటి పోతున్నారు. 

నామమాత్రపు చర్యలు

నిర్మల్ జిల్లాలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలపై అనేక ఫిర్యాదులు వస్తున్న అధికారులు మాత్రం నామమాత్రపు చర్యలు తీసు కుంటున్న.ట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లో రైతులకు మద్దతు ధర కల్పించి నాణ్యతగా ఉన్న ధాన్యాన్ని 48 గంటల్లోనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమయ్యే గోను సంచులు లతోపాటు విద్యుత్ లైట్లు తాగునీరు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన కొనుగోలు కేంద్రాల్లో లైట్లు ఏర్పాటు చేయకపోవడం తాగు నీరు లేకపోవడం రైతులు చిమ్మ చీకట్లోనే ధాన్యా న్ని కంటికి రెప్పలుగా కాపాడుతున్నారు. ధాన్యం తూకం వేసే వరకు రైతులదే బాధ్యత కావడంతో కొనుగోలు కేంద్రా ల వద్దని పడిగాపులు పడుతూ సమయం వృధా కావడంతో వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని రైతులు పేర్కొంటు న్నారు.

అనుకోని వర్షాల వల్ల ధాన్యం తడిస్తే దాన్ని తిరిగి ఆరబెట్టడానికి కూలీలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ఖర్చులు కూడా తమపై పడుతున్నాయని రైతులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి లో అడిషనల్ కలెక్టర్ డీఎస్‌ఓ ఇతర అధికారులతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసిన వారు క్షేత్రస్థాయిలో రైతులకు పడుతున్న ఇబ్బందులను తొలగించ డంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వివరిస్తున్నాయి.

గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్న ప్రజాపాలకు ధాన్యం కొనుగోలు విషయంలో తమకేమీ పట్టనట్టు వివరిస్తున్నట్టు రైతులు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటున్నాం : జేసీ కిశోర్‌కుమార్

నిర్మల్ జిల్లాలో పర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటున్నాం. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకు వస్తే బస్తాకు 40.500 కేజీలను కొనుగోలు చేయడం జరుగుతుందని అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే తమకు రైతులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.

కూలీలు అమలులో పేరుతో అధిక డబ్బులు వసూలు చేసిన వారిపై కూడా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. కొనుగోలు చేసిన దానిని వెంట వెంటనే రవాణా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.