20-11-2025 08:20:55 PM
అమీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో 60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్
వివాహాలు, శుభకార్యాలయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కేసులు నమోదు చేస్తాం
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్
అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు అమీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుమారు 60 మంది హిజ్రాలకు అమీన్ పూర్ ఎస్‌హెచ్‌ఓ నరేష్, ఇన్స్పెక్టర్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాహాలు, శుభకార్యాలయాలు, ఇతర ప్రజా ప్రదేశాలలో ప్రజలను బయబ్రాంతులకు గురిచేస్తూ, నేర పూరిత చర్యలకు దిగుతూ ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు డబ్బు వసూలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
చట్టానికి లోబడి, సమాజంలో అందరిలా సాదారణ జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ...శుభకార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఇళ్లకు వెళ్లి ప్రజలను బయబ్రాంతులకు గురిచేస్తూ, నేర పూరిత చర్యలకు దిగుతూ బలవంతపు డబ్బు వసూలు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కేసులు నమోదు చేయాలని ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగినట్లయితే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.