20-11-2025 08:23:18 PM
రూ.96 లక్షలతో నిర్మించిన వృద్ధాశ్రమం
రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
కామారెడ్డి (విజయక్రాంతి): నిరాశ్రయులైన వృద్ధులకు ప్రభుత్వము ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం నిర్మించడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 96 లక్షల వ్యయంతో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఇంతకుముందు కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో 8 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం, బ్యాడ్మింటన్ కోడ్ ఇండోర్ క్రీడలు, రైఫిల్ రేంజ్, ఎంట్రెన్స్ ప్లాజా నిర్మాణం, ఇందిరా గాంధీ స్టేడియం కోసం కాంపౌండ్ వాల్ నిర్మాణం పార్కింగ్ ప్రాంతానికి ఇంటర్ లాకింగ్ పేపర్ బ్లాక్ లను అందించడం పచ్చదనాన్ని అందించడం వంటి రూ. 9.58 కోట్ల పనులతో రెడ్డి జిల్లా కేంద్రంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, బిటి రోడ్లు, కామారెడ్డి మార్కెట్ యార్డులో టాయిలెట్లు బ్లాక్ నిర్మాణం కాంపౌండ్ వాల్ దెబ్బతిన్న రాంప్ల నిర్మాణం కోసం 51 లక్షలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సందర్భంగా రీడింగ్ రూమ్లో మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాల గాని పుస్తకాల పట్టణం వ్యక్తిత్వ వికాసానికి సామాజిక చైతన్యానికి ప్రజాస్వామ్య బలపరచడానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు పల్లెల్లో గ్రంధాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి విద్యార్థి యువకుడు గ్రంథాలయాళంలో వినియోగించుకోవాలని కోరారు. డిజిటల్ లైబ్రరీలు ఈ లెర్నింగ్ సౌకర్యాలను మరింతగా విస్తరించి ఉన్నట్లు తెలిపారు. వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి సామూహికంగా భోజనాన్ని మంత్రి సీతక్క చేశారు. ఈ కార్యక్రమంలో జై రాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.