calender_icon.png 20 November, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు 72 క్రీడాకారులు ఎంపిక

20-11-2025 08:17:21 PM

కోచ్ రవికుమార్ గణేష్..

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలంలోని మోడల్ స్కూల్ ఆవరణలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్ 14 అండర్ 17 అండర్ 19 బాల బాలికల ఫెన్సింగ్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 300 మంది పైన పాల్గొన్నారు. వీరిలో 72 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు, ఈ పోటీలను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ప్రారంభించారు. ఎంపికైన క్రీడాకారులు అండర్ 14 బాలబాలికలకు ఈ నెల 21, 22, 23 తేదీలలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు జిల్లా పరిషత్ హై స్కూల్ లో టోర్నమెంట్ ఉంటుందని అండర్ 17 బాలబాలికలకు ఈ నెల 23,24,25 తేదీలలో,అండర్ 19 బాల,బాలికలకు ఈ నెల 22,23,24 తేదీలలో నెల్లికుదురు పాఠశాలలోనే పోటీలు ఉంటాయని ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు నాగరాజు, సౌందర్య, శ్రీనివాస్, గణపతి,సమ్మయ్య కోచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ రెఫరీలు కరణం మల్లీశ్వరి,కౌండిన్య,అన్నం రవి,స్వర్ణలత, భవాని,నిశాంత్, శ్రీశాంత్ అంజలి,తదితరులు పాల్గొన్నారు.