calender_icon.png 20 November, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖేలో ఇండియా పోస్టర్ల ఆవిష్కరణ

20-11-2025 08:18:49 PM

నిర్మల్ (విజయక్రాంతి): అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేపటి నుంచి జిల్లాలో నిర్వహించబోయే బాలికల అండర్ 14, అండర్ 16 ఖేలో ఇండియా ఖేలో ఇండియా జిల్లా స్థాయి ఎంపిక పోటీలు రేపటి నుంచి నిర్వహించనున్నారు. ఈ ఎంపిక పోటీలకు సంబంధించి గోడప్రతులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం సాయంత్రం తన ఛాంబర్లో విడుదల చేశారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్లో నైపుణ్యాలు దాగి ఉన్నాయని, ఇటువంటి పోటీల ద్వారా వాటిని వెలికి తీయాలని అన్నారు. ఎంపిక పోటీలు పగడ్బందీగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ ఎంపిక పోటీల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఓ భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్యాముల్, ఎస్జిఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్, గిరిప్రసాద్, తదితరులు ఉన్నారు.